: చంద్రబాబుది ఆఖరి పోరాటం... మోడీ ఓ హిట్లర్: చిరంజీవి
అధికారం కోసం టీడీపీ అధినేత చంద్రబాబు ఆఖరి పోరాటం చేస్తున్నారని కేంద్ర మంత్రి చిరంజీవి ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో ఓడిపోతే ఆయన పని ఖతమని అన్నారు. అందుకే అధికారం కోసం హిట్లర్ లాంటి మోడీతో పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని చెప్పారు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ ఒక్కటే కారణం కాదని... అన్ని పార్టీలు తమ సమ్మతిని తెలిపినందుకే రాష్ట్ర విభజన జరిగిందని తెలిపారు.