: మొదటి భార్య వివరాలను ఈసీకి అందించిన పాశ్వాన్
జాతీయ నేతలకు భార్యల రూపంలో ఊహించని సమస్యలు తలెత్తుతున్నాయి. మోడీ భార్య ఉదంతం జాతీయ స్థాయిలో ఎంత ప్రాధాన్యత సంతరించుకుందో తెలిసిందే. ఇప్పుడు తాజాగా లోక్ జనశక్తి పార్టీ అధినేత రామ్ విలాస్ పాశ్వాన్ కూడా ఇదే సమస్యను ఎదుర్కొన్నారు. ఈసీకి అందించిన అఫిడవిట్ లో పాశ్వాన్ తన మొదటి భార్య వివరాలను పేర్కొనలేదని... అందువల్ల పాశ్వాన్ పోటీ చేసిన హాజీపూర్ (బీహార్) లో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని జేడీయూ కోరింది. దీంతో, తన మొదటి భార్య వివరాలను పాశ్వాన్ ఈసీకి అందజేశారు. తనకు 1960లో రాజకుమారితో పెళ్లి అయిందని... 1981లో విడాకులు తీసుకున్నామని పేర్కొన్నారు.