: నేడు బాలయ్య పర్యటన వివరాలు
ఎన్నికల ప్రచారం నేపథ్యంలో టీడీపీ స్టార్ క్యాంపెయినర్ గా బరిలోకి దిగిన ఆ పార్టీ నేత, సినీ నటుడు బాలకృష్ణ ఉత్తరాంధ్రలో దూసుకుపోతున్నారు. ఈ రోజు ఆయన విజయనగరం, విశాఖ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటలకు విజయనగరం జిల్లా కొత్తవలస, మధ్యాహ్నం 12కి విశాఖ జిల్లా పెందుర్తి, సాయంత్రం నాలుగు గంటలకు అనకాపల్లి సభల్లో ఆయన పాల్గొంటారు.