: బీఈడీ అభ్యర్ధుల ర్యాలీ ఉద్రిక్తం


బీఇడీ అభ్యర్థుల సచివాలయం ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. ఉపాధ్యాయ నియామకాల్లో ఎస్జీటీ పోస్టుల్లో బీఇడీ అభ్యర్థులకు అవకాశమివ్వాలని డిమాండ్ చేస్తూ బీఇడీ విద్యార్థి సంఘం నేడు హైదరాబాదులో ఈ కార్యక్రమం చేపట్టింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బీఇడీ అభ్యర్థులు ప్రదర్శనగా బయలుదేరగా, వారిని ఎన్ సీసీ గేటు దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ కొద్దిసేపు పోలీసులకు, విద్యార్థులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహించిన విద్యార్థులు ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్థం చేసి నిరసన తెలిపారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ శనివారం బీఇడీ కళాశాలల బంద్ కు ఆందోళనకారులు పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News