: మోడీకి ఆ సత్తా ఉంది... పవన్ కు కృతజ్ఞతలు: జేపీ
దేశాన్ని సరైన దిశలో నడిపించే సత్తా బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి ఉందని లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ తెలిపారు. బేగంపేట విమానాశ్రయంలో మోడీని కలసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నరేంద్ర మోడీకి లోక్ సత్తా మద్దతు తెలుపుతోందని చెప్పారు. మోడీతో తాను వ్యక్తిగతంగా మాట్లాడానని... కిషన్ రెడ్డి సమక్షంలో చంద్రబాబుతో ముచ్చటించానని తెలిపారు. తన కోసం పవన్ కల్యాణ్ ఎన్నికల బరి నుంచి తప్పుకోవడం చాలా గొప్ప విషయమని... పవన్ కల్యాణ్ మద్దతుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు.