: ఎన్డీఏ అధికారంలోకి రావాలి, మోడీ ప్రధాని కావాలి: చంద్రబాబు


గుజరాత్ ను అద్భుతంగా అభివృద్ధి చేసిన నరేంద్ర మోడీ దేశాన్ని కూడా అభివృద్ధి పథంలోకి తీసుకెళతారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. అవినీతిని ప్రక్షాళన చేయాలంటే మోడీ రావాల్సిందేనని చెప్పారు. మహబూబ్ నగర్ లో జరిగిన బీజేపీ విజయ శంఖారావం సభలో చంద్రబాబు ప్రసంగిస్తూ మోడీని పొగడ్తల వర్షంలో ముంచెత్తారు. దేశంలోని సమస్యలు పరిష్కారం కావాలంటే ఎన్డీఏ అధికారంలోకి రావాలని తెలిపారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో దేశం సర్వనాశనమైపోయిందని... రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ చిత్తుచిత్తుగా ఓడిపోతుందని జోస్యం చెప్పారు. రెండు రాష్ట్రాల్లో కూడా టీడీపీ అధికారంలోకి వస్తుందని తెలిపారు.

  • Loading...

More Telugu News