: కేసీఆర్ కు సవాల్ విసిరిన ఎల్.రమణ
టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పై టీటీడీపీ నేత ఎల్.రమణ తీవ్ర విమర్శలు గుప్పించారు. గతంలో కేసీఆర్ చేసిన ఆమరణ దీక్ష నిజమైంది కాదని... అదొక బూటకమని ఆరోపించారు. దీనిపై విచారణను ఎదుర్కోవడానికి కేసీఆర్ సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు. తెలంగాణలో బీడీ కార్మికుల పొట్టగొట్టింది కేసీఆరే అని... 610 జీవో వద్దు అని చెప్పింది కూడా ఆయనే అని విమర్శించారు.