: రాహుల్ స్థానంలో ప్రియాంకను తీసుకురాం: శరద్ పవార్
కాంగ్రెస్ ను ముందుకు తీసుకెళ్లడంలో విఫలమయ్యాడంటూ విమర్శలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ స్థానంలో ఆయన సోదరి ప్రియాంకను తీసుకువచ్చే ప్రసక్తే లేదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా సేవలందించి ఉంటే రాహుల్ సత్తా ప్రజలకు తెలిసేదని అభిప్రాయపడ్డారు. మోడీ ప్రధాని అవుతారని తాను భావించడం లేదని చెప్పారు.