: పైలట్ తో గొడవపడిన పొన్నాల
టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య హెలికాప్టర్ పైలట్ తో గొడవపడ్డారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న పొన్నాల వరంగల్ జిల్లా మడికొండకు వెళ్లాలని పైలట్ ను అడిగారు... అయితే, అక్కడకు వెళ్లేందుకు తనకు అనుమతి లేదంటూ, పొన్నాల కోరికను పైలట్ నిరాకరించాడు. దీంతో పైలట్ తో పొన్నాల గొడవపడ్డారు. అయినా, పైలట్ మాత్రం ససేమిరా అన్నాడు. దీంతో, ఆవేశానికి గురైన పొన్నాల హెలికాప్టర్ దిగి... తన దారిన తాను మడికొండకు వెళ్లారు.