: సచిన్ సంపాదనకు పీవీనే కారణం: పవన్


తనకు ఎంతో ఇష్టమైన క్రికెటర్ సచిన్ టెండూల్కర్ వందలు, వేల కోట్ల రూపాయలు సంపాదించాడంటే... దానికి కారణం దివంగత ప్రధాని పీవీ నరసింహారావే కారణమని పవన్ కల్యాణ్ తెలిపారు. దీనికి కారణం ఆయన తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలే అని... దేశం ఆర్థికాభివృద్ధి చెందింది కాబట్టే సచిన్ వెంట మల్టీ నేషనల్ కంపెనీలు క్యూ కట్టాయని చెప్పారు. అంత గొప్ప పీవీని కూడా కాంగ్రెస్ పార్టీ ఘోరంగా అవమానపరిచిందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి అంటే రింగు రోడ్డులు నిర్మించడం కాదు... నీరు, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాల కల్పన అని చెప్పారు. ఈసారి మన దేశానికి మాటల మనిషి కాకుండా, చేతల మనిషి నరేంద్ర మోడీ ప్రధాని అవుతున్నారని చెప్పారు. మోడీ నాయకత్వంలో దేశం మొత్తం ఎంతో పారిశ్రామిక అభివృద్ధి చెందుతుందని జోస్యం చెప్పారు.

  • Loading...

More Telugu News