: నా జీవితంలో కీలక ఘట్టంలోకి అడుగుపెట్టా: రాణీముఖర్జీ
ఇటలీలో నిన్న రాత్రి ప్రముఖ దర్శకుడు ఆదిత్య చోప్రాను పెళ్లి చేసుకున్న నటి రాణీ ముఖర్జీ తన సందేశంతో కూడిన ప్రకటన విడుదల చేశారు. 'ఎంతోమంది శ్రేయోభిలాషులు ఈ రోజు కోసం ఎదురు చూశారు. అలాంటి ఈ రోజు నాకు ఎంతో సంతోషకరమైనది. కేవలం కొద్ది మంది బంధువులు, స్నేహితుల సమక్షంలో ఇటలీలో జరిగిన అందమైన వివాహం మాది. యాష్ అంకుల్ ఒక్కరినే నేను ఈ వేడుకలో మిస్ అయ్యాను. అయితే, ఆయన ప్రేమ, ఆశీస్సులు ఎప్పుడూ మాతోనే ఉంటాయి. నేను ఎప్పుడూ అద్భుత గాధలను నమ్ముతూ ఉంటాను. నా జీవితం కూడా అలాంటిదే. ప్రస్తుతం నేను కీలక ఘట్టంలోకి అడుగుపెట్టాను' అంటూ రాణీ ముఖర్జీ తన మనసులోని భావాన్ని వ్యక్తపరిచారు.