: సాయంత్రం 6 గంటలకు మోడీని కలవనున్న జేపీ
ఎన్నికల ప్రచారం నేపథ్యంలో తెలంగాణలో నిర్వహించే సభల్లో పాల్గొనేందుకు రాష్ట్రానికి వస్తున్న బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీని లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ ఈ రోజు కలవనున్నారు. మరికాసేపట్లో మోడీ హైదరాబాదు చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా ఆయన నిజామాబాద్ వెళతారు. తిరిగి సాయంత్రం బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అప్పుడే అంటే ఆరు గంటల సమయంలో మోడీని జేపీ కలుస్తారు. తాను మల్కాజిగిరి స్థానంలో పోటీ చేస్తున్న విషయంపై కూడా చర్చించే అవకాశముందని తెలుస్తోంది.