: చంద్రబాబు పాలనంతా స్కాములతోనే సాగింది: విజయమ్మ
ఈ రోజు తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవులో వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ, టీడీపీ అధినేత చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. టీడీపీ పాలనాకాలం అంతా స్కాములమయమేనని ఆరోపించారు. వేతనాలు పెంచాలని కోరిన అక్కాచెల్లెళ్లను గుర్రాలతో తొక్కించింది, రైతులను కాల్పించింది చంద్రబాబే అని విమర్శించారు. అభిమానులను తాకట్టు పెట్టిన ఘనత చిరంజీవిదని ఎద్దేవా చేశారు. సమైక్యాంధ్ర అనే పదం ఉచ్చరించే అర్హత కూడా కిరణ్ కుమార్ రెడ్డికి లేదని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లే సామర్థ్యం జగన్ కే ఉందని చెప్పారు.