: సిరియా, కొరియాల్లో శాంతి కోసం.. వాటికన్ లో ప్రార్థనలు!
ప్రపంచ శాంతి కోసం కొత్త పోప్ ఫ్రాన్సిస్ ప్రార్థనలు నిర్వహించారు. అంతర్యుద్ధంతో రగులుతున్న సిరియా, అగ్రరాజ్యం అమెరికాతో కయ్యానికి కాలు దువ్వుతున్న ఉత్తరకొరియా, పొరుగుదేశం ధాటికి బిక్కచచ్చిపోతున్న దక్షిణకొరియా దేశాల ప్రజలకు శాంతి చేకూరాలని, నిన్న వాటికన్ లో ప్రార్ధనలు చేశారు. ఈస్టర్ సందర్భంగా ఆయన వాటికన్ లోని సెయింట్ పీటర్స్ స్క్వేర్ వద్ద రెండున్నర లక్షలమందితో భారీ సామూహిక ప్రార్థన నిర్వహించారు. తనదైన శైలిలో ప్రజలతో మమేకం అవుతున్న పోప్ ఈస్టర్ వేడుకల అనంతరం భక్తులతో గడిపారు. వారికోసం ప్రత్యేక ఆశీర్వాద ప్రసంగం చేశారు.