: తెలంగాణలో ప్రచారం చేయనున్న సుష్మాస్వరాజ్, జీవిత, రాజశేఖర్


తెలంగాణలో వీలైనన్ని ఎక్కువ స్థానాలను కైవసం చేసుకోవడానికి బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఈ నేపథ్యంలో, తెలంగాణ సాధన విషయంలో లోక్ సభలో కీలక పాత్ర పోషించిన బీజేపీ నేత సుష్మాస్వరాజ్ ను ఆ పార్టీ ఎన్నికల ప్రచారంలోకి దింపనుంది. సుష్మా షెడ్యూల్ ఇప్పటికే ఖరారయింది. ఈ నెల 26న కల్వకుర్తి, మెదక్, వరంగల్, భువనగిరిలలో నిర్వహించే బహిరంగ సభల్లో ఆమె పాల్గొంటారు. అలాగే, ఈ నెల 25న మణుగూరు, భూపాలపల్లి, సిరిసిల్ల, సంగారెడ్డిల్లో కిషన్ రెడ్డి, సినీ నటులు జీవిత, రాజశేఖర్ లు ప్రచారం నిర్వహిస్తారు.

  • Loading...

More Telugu News