: నోటి దురుసు నేతలకు మోడీ గీతాబోధన


వివాదాస్పద వ్యాఖ్యలతో మంటలు పుట్టిస్తున్న బీజేపీ నేతలకు మోడీ గీతాబోధన చేశారు. బీజేపీ శ్రేయోభిలాషులు చేసే ఇలాంటి అల్పమైన ప్రకటనలు... అభివృద్ధి, సుపరిపాలన కోసం పార్టీ చేస్తున్న ప్రచారాన్ని పక్కదోవ పట్టించే పరిస్థితి ఉంటుందని సున్నితంగా మందలిస్తూ మోడీ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. బాధ్యతారాహిత్య ప్రకటనలను తాను ఆమోదించనని, అలాంటివి చేయకుండా ఉండాలని నేతలను కోరారు. మోడీ వ్యతిరేకులు ఎన్నికల తర్వాత పాక్ కు వెళ్లాలని ఇటీవలే బీజేపీ బీహార్ నేత గిరిరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు గుర్తుండే ఉంటాయి. ఈ నేపథ్యంలో మోడీ వాటికి చెక్ పెట్టేలా సందేశం ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.

  • Loading...

More Telugu News