: కోడ్ ఉల్లంఘించిన బాలకృష్ణ... నోటీసు జారీ
టీడీపీ తరపున ప్రచార కార్యక్రమం చేపట్టిన ఆ పార్టీ నేత నందమూరి బాలకృష్ణ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. అధికారుల అనుమతి లేకుండా రోడ్ షో నిర్వహించడంతో శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట రిటర్నింగ్ అధికారి తనూజా రాణి నోటీసులు జారీ చేశారు. నిన్న చేపట్టిన రోడ్ షో సందర్భంగా పోలాకి, ఉర్లాం ప్రాంతాల్లో మాత్రమే బహిరంగ సభలు నిర్వహిస్తామని అనుమతి తీసుకున్నారని... కానీ, మడపా బ్రిడ్జి నుంచి సత్యవరం మీదుగా నరసన్నపేట చేరుకుని నియమావళిని ఉల్లంఘించారని నోటీసులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బాలకృష్ణతో పాటు టీడీపీ ఎంపీ అభ్యర్థి కింజరపు రామ్మోహన్ నాయుడు, అసెంబ్లీ అభ్యర్థి రమణమూర్తికి కూడా నోటీసులు జారీ చేశామని ఎన్నికల అధికారి తెలిపారు.