: కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలయింది: బాలకృష్ణ
పది సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలయిందని... వ్యవస్థ సర్వనాశనమైపోయిందని సినీనటుడు, టీడీపీ నేత బాలకృష్ణ ఆరోపించారు. మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వినాశనం తప్పదని అన్నారు. వైఎస్సార్సీపీని గెలిపిస్తే అవినీతికి వత్తాసు పలికినట్టవుతుందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కేవలం చంద్రబాబుతోనే సాధ్యమని చెప్పారు. టీడీపీ విజయానికి కార్యకర్తలందరూ కృషి చేయాలని కోరారు.