: నటుడు శివకృష్ణ ‘సైకిలె’క్కారు!
సినీ నటుడు, ‘మా’ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు శివకృష్ణ తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. శివకృష్ణకు పార్టీ కండువా కప్పి చంద్రబాబు ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.