: రైతుల రుణమాఫీపై తొలి సంతకం చేస్తా: చంద్రబాబు


రాజకీయాల్లో తన కంటే ఎవరికీ ఎక్కువ అనుభవం లేదని చంద్రబాబు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ చిత్తూరు జిల్లా చంద్రగిరిలో జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ... అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల రుణ మాఫీపై తాను తొలి సంతకం చేస్తానని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే రైతులకు అన్ని విధాలుగా మేలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్ర విభజనతో తెలుగు వారికి అన్యాయం చేసిన వాళ్లకి తగిన బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. తెలుగు ప్రజలకు అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలని ఆయన చెప్పారు. విభజన విషయంలో రెండు ప్రాంతాల వారికి సమన్యాయం చేయాలని చెప్పినా కేంద్రం వినలేదన్నారు.

  • Loading...

More Telugu News