: వచ్చే ఐదేళ్లలో పేదవారే లేకుండా చేస్తాం: రాహుల్
వచ్చే ఐదేళ్ల కాలంలో పేదరికాన్ని సమూలంగా నిర్మూలిస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. కార్పెంటర్లు, పెయింటర్లు, ప్లంబర్లు తదితర వృత్తి చేసుకుని జీవనం సాగించే వారిని గుర్తించి... వారిని అట్టడుగు స్థాయి నుంచి మధ్యతరగతి స్థాయికి తీసుకెళ్తామని రాహుల్ అన్నారు. వారికి అవసరమైన విద్య, వైద్యాన్ని ఉచితంగా అందిస్తామని ఆయన పేర్కొన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో వారి పిల్లలకు మెరుగైన విద్యను అందిస్తామని ఆయన భరోసా ఇచ్చారు.