: ప్రజల ఆకాంక్షను అర్థం చేసుకొనే తెలంగాణ ఇచ్చాం: రాహుల్


నిజామాబాద్ జిల్లా సాంపల్లిలో జరిగిన బహిరంగసభలో కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ ప్రజలు ఎన్నో యేళ్లుగా ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటాలు చేశారని... యువకులు, మహిళలు, రైతులు, శ్రామికులు తెలంగాణ కోసం పోరాటాలు చేశారని రాహుల్ అన్నారు. తెలంగాణ కోసం వారి ఆకాంక్షను అర్థం చేసుకున్నామని ఆయన చెప్పారు. ప్రజల ఆకాంక్ష మేరకే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చామని ఆయన తెలిపారు. తెలంగాణ కల సాకారం కావడంలో కాంగ్రెస్ పాత్ర ఉందని అన్నారు. ఏకాభిప్రాయానికి వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చామని రాహుల్ అన్నారు. సోనియాగాంధీ లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదన్నారు. కొత్త రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి ప్రయోజనం ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణలో సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇస్తామని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News