: స్వామి సన్నిధిలో 'స్వామి రారా' యూనిట్


'స్వామి రా రా' చిత్ర బృందం ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. తమ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతున్న సందర్భంగా తిరుపతిలో విజయయాత్ర నిర్వహిస్తున్నామని హీరో నిఖిల్ చెప్పారు. ఇందులో భాగంగా స్వామివారిని దర్శించుకున్నామని ఆయన అన్నారు.

దేవుడి దయవల్లే సినిమా విజయం సాధించిందన్నారు. తెలుగులో తాజాగా విడుదలై ప్రేక్షకాదరణ పొందుతున్న 'స్వామి రా రా' సినిమాలో నిఖిల్, స్వాతి హీరో, హీరోయిన్లుగా నటించగా సుధీర్ వర్మ దర్శకత్వం వహించారు. 

  • Loading...

More Telugu News