: మీకు తీరిక ఉన్నప్పుడు అవిశ్వాసం పెడతారా?: టీడీపీకి అంబటి ప్రశ్న


కాంగ్రెస్ సర్కార్ పై అవిశ్వాసం పెట్టాలని తెలుగు దేశం పార్టీపై వైఎస్ఆర్ కాంగ్రెస్ తీవ్ర ఒత్తిడి తెస్తోంది.ఇందులో భాగంగానే ఆ పార్టీనేత అంబటి రాంబాబు తనదైన శైలిలో, టీడీపీ విశ్వాసానికి సిద్ధంగా లేకపోవడంపై వ్యాఖ్యానించారు. సర్కారు మైనార్టీలో ఉన్నప్పుడు కాకుండా, అంతా సర్దుకున్నాక తీరికగా అవిశ్వాసం పెడతారా, ఏమిటి?అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు. అవిశ్వాసం పెట్టమని మీ పార్టీవారే అడుగుతున్నారు. అలాంటప్పుడు మీ నాయకుడు ఏం చేస్తున్నాడు? అంటూ అంబటి, టీడీపీ నేతలను సూటిగా అడిగారు. గుంటూరులో విలేకరుల సమావేశంలో ఆయన ఈ విధంగా స్పందించారు.

  • Loading...

More Telugu News