: తెలంగాణపై వరాల జల్లును కురిపించిన రాహుల్ గాంధీ


మహబూబ్ నగర్ లో జరిగిన బహిరంగసభలో కాంగ్రెస్ యువ నేత రాహుల్ గాంధీ పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ అమరులకు ముందుగా రాహుల్ నివాళులర్పించి తన ప్రసంగాన్ని కొనసాగించారు. చేసేదే చెప్తాం... చెప్పిందే చేస్తామని రాహుల్ అన్నారు. తెలంగాణను ఇస్తామన్న మాటకు కట్టుబడి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. తెలుగు వారి రెండు రాష్ట్రాల్లోనూ ప్రజల ఆకాంక్షను కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుందని ఆయన చెప్పారు.

టీఆర్ఎస్ కంటే ముందే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఆకాంక్షను వెలిబుచ్చిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. తెలంగాణ బిల్లు పెట్టడంలో టీఆర్ఎస్ ప్రమేయం లేదని రాహుల్ స్పష్టం చేశారు. తెలంగాణను ఇస్తే టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తామని చెప్పిన కేసీఆర్... ఆ తర్వాత మాట తప్పారని ఆయన అన్నారు. టీఆర్ఎస్ పార్టీది అధికార కాంక్ష మాత్రమేనని ఆయన తేల్చి చెప్పారు.

తెలంగాణను ఎలా అభివృద్ధి చేయాలో కూడా కాంగ్రెస్ కి మాత్రమే తెలుసునని ఆయన అన్నారు. ఈ సందర్భంగా రాహుల్ తెలంగాణపై వరాల జల్లు కురిపించారు. తెలంగాణలో 4 వేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రాంతానికి పదేళ్ల పాటు పన్ను మినహాయింపు ఇస్తామని ఆయన అన్నారు. ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా కల్పిస్తామన్నారు.

  • Loading...

More Telugu News