: ఉండవల్లి ‘ఉద్యోగం’ ఇప్పుడు రాపోలుకి!


కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభల్లో అగ్ర నేతల ప్రసంగాన్ని ఇదివరకైతే ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ హిందీ నుంచి తెలుగుకి అనువదించేవారు. అయితే ఉండవల్లి కాంగ్రెస్ పార్టీని వీడి జై సమైక్యాంధ్ర పార్టీలో చేరడంతో ఇప్పుడా ‘ఉద్యోగం’ ఖాళీ అయ్యింది. మొన్న సోనియా ఉపన్యాసానికైతే తెలుగులో అనువదించేవారే కరవయ్యారు. అయితే, ఇవాళ రాహుల్ గాంధీ సభలో యువనేత ప్రసంగాన్ని ఆ పార్టీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ తెలుగులో అనువదించి సభికులకు వినిపించారు. దాంతో ఉండవల్లి ఉద్యోగం ఇప్పుడు రాపోలుకి వచ్చినట్టే కదా!

  • Loading...

More Telugu News