: పొన్నాల స్క్రిప్టును జైరాం చదవుతున్నారు: హరీష్ రావు


కేంద్రమంత్రి జైరాం రమేశ్ పై టీఆర్ఎస్ సిద్ధిపేట అభ్యర్థి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య స్క్రిప్టు రాసిస్తే జైరాం వాటిని చదువుతున్నారన్నారు. తెలంగాణ ప్రయోజనాలకు తూట్లు పొడిచిన వ్యక్తి ఆయనని మండిపడ్డారు. జైరాం చెప్పినట్లు నడుచుకుంటే కాంగ్రెస్ కు పది సీట్లు కూడా రావని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అన్నారు. దొరలకు టికెట్లిచ్చిన కాంగ్రెస్, కమిటీల పేరుతో కాలయాపన చేసి తెలంగాణ ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు.

  • Loading...

More Telugu News