: ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్యపై కోడిగుడ్లతో దాడి
మాజీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతిపై నల్లగొండ జిల్లాలో దాడి జరిగింది. పద్మావతి కోదాడ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మునగాల మండలం నర్సింహులగూడెం వెళ్లారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, సీపీఎం కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. దాంతో సీపీఎం కార్యకర్తలు కోడిగుడ్లు, చెప్పులతో పద్మావతిపై దాడి చేశారు. పోలీసులు వారిని చెదరగొట్టడంతో పద్మావతి నర్సింహుల గూడెంలో ప్రచారాన్ని రద్దు చేసుకుని, జగన్నాథపురం వెళ్లిపోయారు.