: భర్తకు టికెట్ నిరాకరించడంపై మండిపడ్డ సిద్ధూ భార్య
తన భర్తకు లోక్ సభ టికెట్ నిరాకరించడంపై బీజేపీ నేత వనజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ శిరోమణీ అకాలీదళ్ పార్టీపై మండిపడ్డారు. సిద్ధూ అమృత్ సర్ ప్రజల ఆత్మ అని ఆమె అభవర్ణించారు. పొత్తులో భాగంగా ఇరు పార్టీల అభ్యర్థిగా అరుణ్ జైట్లీ అమృత్ సర్ నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. దాంతో సిద్ధూకి మొండిచేయి ఎదురైంది. అయితే, సిద్ధూ విషయంలో జరిగినది సరిగా లేదని కౌర్ అభిప్రాయపడ్డారు.