: ఆ మాజీ డీజీపీలు రాజకీయంగా కనుమరుగయ్యారు... మరి ఈయనో?


డీజీపీ... రాష్ట్ర పోలీస్ విభాగంలో అత్యున్నత పదవి. పోలీస్ బాస్ గా పనిచేసిన కొందరు రాజకీయంగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉన్నారు. అలాంటి వారిలో తాజాగా మాజీ డీజీపీ దినేష్ రెడ్డి గురించి చెప్పుకోవచ్చు. గతంలో పేర్వారం రాములు డీజీపీ పదవి నుంచి దిగిపోయిన తర్వాత టీడీపీలో చేరారు. పరిస్థితి ఆశాజనకంగా లేకపోవడంతో తర్వాత టీఆర్ఎస్ కు మారారు. అక్కడా అనుకూలించకపోవడంతో కనిపించకుండా పోయారు.

ఇక సీబీఐ డైరెక్టర్ గా పనిచేసి పదవీ విరమణ తీసుకున్న తర్వాత విజయరామారావు 1999లో ఖైరతాబాద్ స్థానం నుంచి అసెంబ్లీకి పోటీ చేసి గెలిచారు. రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేసి పేరు తెచ్చుకున్నారు. కానీ, ఏమైందో గానీ, ఆ తర్వాత ఆయన కూడా కనుమరుగయ్యారు. ఇక డీజీపీగా ఇటీవలే పదవీ విరమణ చేసిన దినేష్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరి మల్కాజ్ గిరి లోక సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఓడినా, గెలిచినా రాజకీయాల్లో నిలదొక్కుకుంటారా? లేక మిగతవారిలా ఈయన కూడా పలాయనం చిత్తగిస్తారా? కాలమే సమాధానం చెప్పాలి.

  • Loading...

More Telugu News