: జగన్ కేసులో నేడే సీబీఐ అభియోగపత్రం


వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసులో అభియోగ పత్రాన్ని ఈ రోజు సీబీఐ దాఖలు చేయనుంది. ఆస్తుల కేసులో ఇప్పటివరకు నాలుగు అనుబంధ అభియోగపత్రాలను సీబీఐ అధికారులు దాఖలు చేశారు. తాజాగా దాఖలు చేయనున్న అభియోగ పత్రం కేసుకే కీలకం కానుంది.

ఇదిలావుంటే, జగన్ కేసులో కొన్ని రోజుల కిందట రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావును సాక్షిగా పిలిచి అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. విచారణ సమయంలో కేవీపీ ఇచ్చిన వాంగ్మూలాన్ని  సీబీఐ నమోదు చేసింది. అయితే, ఈసారి అభియోగపత్రంలో ఎవరిని సీబీఐ సాక్షులుగా పేర్కొంటుంది, ఎవరిని నిందితులుగా చేరుస్తుందనేది సస్పెన్స్ !

  • Loading...

More Telugu News