: పవన్ ఆలోచనలో నిలకడ ఉండదు: సుబ్బరామిరెడ్డి
నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై కాంగ్రెస్ సీనియర్ నేత టి.సుబ్బరామి రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయనకు రాజకీయ అవగాహన లేదని, ఆలోచనలో నిలకడ ఉండదన్నారు. ఇంటికే పరిమితమైన వ్యక్తి ఒక్కసారిగా బయటికి వచ్చి దేశానికి సేవ చేస్తానంటే నమ్మశక్యంగా లేదని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ను విమర్శించే ముందు పవన్ ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆయన సూచించారు. ఓ వైపు చిరంజీవిని ఆరాధిస్తూనే... మరోవైపు కాంగ్రెస్ ను విమర్శించడం ద్వంద్వ నీతిని పాటించినట్లేనని టీఎస్ఆర్ అన్నారు. విభజనకు కారణమైన మోడీకి ఎందుకు మద్దతిస్తున్నారో పవన్ కే స్పష్టత లేదని ఆయన ఎద్దేవా చేశారు.