: నేడు చిత్తూరు జిల్లాలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం


తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఈ రోజు చిత్తూరు జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో ఆయన రేణిగుంట చేరుకుంటారు. మధ్యాహ్నం 12.10 గంటలకు ఎస్సార్ పురంలో జరిగే బహిరంగసభలో ప్రసంగిస్తారు. అనంతరం 3 గంటలకు పూతలపట్టు నియోజకవర్గం అరగొండలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడతారు. చివరిగా చంద్రగిరిలో జరిగే బహిరంగసభలో పాల్గొని, అక్కడి నుంచి తిరుపతి వెళ్లి రోడ్ షో ద్వారా ప్రచారం నిర్వహిస్తారు.

  • Loading...

More Telugu News