: ఖమ్మం జిల్లాలో శాసనసభ కమిటీ పర్యటన


సింగరేణి ఓపెస్ కాస్ట్ మైనింగ్ వల్ల గిరిజనులపై ఏ మేరకు ప్రభావం పడుతోంది? నిర్వాసితుల సమస్యలు ఏమిటి? అన్నవి తెలుసుకోవడం కోసం స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో శాసనసభ కమిటీ ఖమ్మం జిల్లాలో పర్యటించనుంది. జిల్లాలోని గిరిజన ప్రాంతాలలో నేటి నుంచి రెండు రోజుల పాటు కమిటీ పర్యటిస్తుంది.

ఇందుకోసం స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆద్వర్యంలోని వన్యప్రాణుల పర్యావరణ పరిరక్షణ కమిటీ సభ్యులు ఆదివారం రాత్రే ఖమ్మం చేరుకున్నారు. ఈ ఉదయం కొత్తగూడెం బయల్దేరి వెళ్లారు. కొత్తగూడెం, మణుగూరు పరిసర ప్రాంతాలలో వీరు పర్యటించనున్నారు. సింగరేణి అధికారులతో సమావేశమై పర్యావరణ పరిరక్షణ విషయమై చర్చలు జరుపుతారు. రేపు కమిటీ భద్రాచలం నియోజకవర్గంలో పర్యటిస్తుంది. 

  • Loading...

More Telugu News