: నేడు తెలంగాణలో రాహుల్ ప్రచారం


ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ రోజు తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు మహబూబ్ నగర్ లోని ఎంవీఎస్ మైదానంలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఇక్కడినుంచి కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి లోక్ సభ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అనంతరం నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గం లోని డిచ్ పల్లి మండలం సాంపల్లిలో జరిగే బహిరంగ సభలో రాహుల్ పాల్గొంటారు. తెలంగాణ బిల్లు ఆమోదం పొందాక ఆయన తొలిసారిగా చేస్తున్న పర్యటన ఇదే. దీంతో పెద్ద ఎత్తున జనసమీకరణ చేసి రాహుల్ సభలను విజయవంతం చేయాలని కాంగ్రెస్ నేతలు పట్టుదలతో ఉన్నారు.

  • Loading...

More Telugu News