: కోల్ కతా కుర్రాడికి యూఎస్ టాప్ వర్శిటీల నుంచి ఆహ్వానం


ఒకటీ రెండూ కాదు, ఏకంగా ఏడు అమెరికన్ టాప్ యూనివర్శిటీల నుంచి మా దగ్గర చదువుకోమంటూ ఆహ్వానాలు అందాయి. అయితే, ఇప్పుడు వాటిలో ఏ వర్శిటీలో చేరాలో తెలియక అరుణావ చందా అనే కోల్ కతా కుర్రాడు తలపట్టుకున్నాడు! ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుంచి ప్లస్ టూ పాసైన అరుణావ అమెరికన్ వర్శిటీల్లో ప్రవేశం కోసం అందరిలాగే పరీక్ష రాశాడు.

అందులో అతను సాధించిన నూటికి నూరు శాతం స్కోర్ చూసి యూనివర్శిటీలన్నీ ముగ్ధులైపోయి ఆహ్వానాలు పంపాయి. అంతేకాదు... స్కాలర్ షిప్పులు, ఫైనాన్షియల్ ఎయిడ్ లూ ప్రకటించాయి. హార్వర్డ్, స్టాన్ ఫోర్డ్, కొలంబియా విశ్వవిద్యాలయాలను షార్ట్ లిస్ట్ చేసుకొన్న అరుణావ... వాటిల్లో ఒకదాన్ని ఎలా ఎంచుకోవాలా? అని ఇప్పుడు ఆలోచిస్తున్నాడు. కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్ చదువుతూ తనకిష్టమైన థియేటర్ ఆర్ట్స్ లోనూ ఓ కోర్సు చేయాలన్నది ప్రస్తుతం అరుణావ ముందున్న లక్ష్యం.

  • Loading...

More Telugu News