: గల్లంతైన ప్రయాణికుల కుటుంబాలకు మలేషియా ఎయిర్ లైన్స్ ఆర్థిక సాయం


గల్లంతైన మలేషియా విమానం ఎం.హెచ్.370 ప్రయాణికుల సమీప బంధువులకు ఆర్థిక సాయం అందించనున్నట్లు మలేషియా ఎయిర్ లైన్స్ ఇవాళ (ఆదివారం) ప్రకటించింది. విమానం కనిపించకుండా పోయిన 44 రోజుల తర్వాత ఈ విషయంపై స్పందిస్తూ మలేషియా విదేశాంగ శాఖ సహాయ మంత్రి హంజా జైనుద్దీన్ ఈ దిశగా తాము రెండు వారాల క్రితమే పని ప్రారంభించినట్లు తెలిపారు. అందరికీ సహాయం అందిస్తామని, ఇప్పటికే తమ ప్రతినిధులు ప్రయాణికుల బంధువులతో సంప్రదింపులు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.

గల్లంతైన విమానంలోని కొందరు ప్రయాణికులు తమ కుటుంబాలకు ప్రధాన ఆధారంగా ఉండేవారని ఆయన అన్నారు. అలాంటి వారి కుటుంబాల వారు తమ ఆర్థిక స్థితిని తెలియజేస్తూ తాము ఆశిస్తున్న సహాయం మొత్తాన్ని పేర్కొనవలసిందిగా ఆయన సూచించారు. 15 వేర్వేరు దేశాలకు చెందిన ప్రయాణికులు ఉన్నందున వారందరి దగ్గర నుంచి వివరాలు తీసుకుని, ఆర్థిక సాయం ఎప్పుడిచ్చేదీ మరోసారి ప్రకటిస్తామని జైనుద్దీన్ చెప్పారు.

239 మంది ప్రయాణికులతో కౌలాలంపూర్ నుంచి బీజింగ్ బయల్దేరిన ఎంహెచ్ 370 విమానం మార్చి 8న జాడ తెలియకుండా పోయిన విషయం విదితమే. పలు దేశాలు తీవ్రంగా శోధిస్తున్నా ఇప్పటివరకు ఆ విమానానికి సంబంధించిన ఆనవాళ్లు లభించలేదు.

  • Loading...

More Telugu News