: టీటీడీ సిబ్బంది తీరుతో నొచ్చుకున్న లారెన్స్
సినీ నటుడు, నృత్య దర్శకుడు, దర్శకుడు లారెన్స్ నొచ్చుకున్నారు. శ్రీవారి దర్శనం కోసం తిరుమల వచ్చిన ఆయన సిబ్బంది తీరుతో ఆగ్రహానికి గురయ్యారు. లారెన్స్ ఈ ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శన సమయంలో సిబ్బంది తనను తోసివేశారని అనంతరం లారెన్స్ మీడియాకు తెలిపారు. దర్శనం పూర్తికాకుండానే నెట్టివేశారని, భక్తుల పట్ల దురుసుగా ప్రవర్తించడం ఎంతమాత్రం సబబు? అని ఆయన ఆవేదన చెందారు.
- Loading...
More Telugu News
- Loading...