: అక్కడ ఎన్నికలు కూడా పండుగే!


ఉత్తరప్రదేశ్ లోని మారుమూల పల్లెల్లో పండుగలకు పబ్బాలకు, పెళ్లిళ్లు వంటి వేడుకలకు మాత్రమే కొత్త చీరలు ధరించి, నిండుగా అలంకరించుకుంటారు. ఐదేళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికలను కూడా అక్కడి వారు పండుగగానే పరిగణిస్తారు. కొత్త చీరలతో అలంకరించుకుని పోలింగ్ బూత్ లకు వెళతారు. దీన్ని ఒక సాంప్రదాయంగా భావిస్తూ మహిళలు ఓటేయడానికి వెళతారు.

ఎన్నికల సీజన్ సందర్భంగా జౌన్ పూర్ ప్రాంతానికి చెందిన కొందరు స్కూలు విద్యార్థులు, కొద్ది మంది కళాశాల విద్యార్థులు కలిసి చీరల వ్యాపారం ప్రారంభించారు. వారు గ్రామ గ్రామానికి, ఇంటింటికీ తిరుగుతూ అమ్మకాలు సాగిస్తున్నారు. వీరి వ్యాపారం జోరుగా సాగుతుండటంతో ఉత్తరప్రదేశ్ లో పోలింగ్ శాతం భారీగా నమోదు కావచ్చని అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News