: నీతిమంతమైన పాలన రావాలంటే ఎన్డీయే గెలవాలి: చంద్రబాబు
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు. తాము అధికారంలోకి వస్తే డ్వాక్రా సంఘాల రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని ఆయన చెప్పారు. బీసీ డిక్లరేషన్ ఇచ్చిన పార్టీ టీడీపీయేనని ఆయన పునరుద్ఘాటించారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు దోచుకున్నారని ఆయన విమర్శించారు. నీతిమంతమైన పాలన రావాలంటే ఎన్డీయే గెలవాలని ఆయన చెప్పారు. ఎన్డీయే గెలవాలనే ఉద్దేశ్యంతోనే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని చంద్రబాబు చెప్పారు.