: కేసీఆర్ కు సవాల్ విసిరిన దామోదర రాజనర్సింహ
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మాజీ ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీ అధ్యక్షుడు దామోదర రాజనర్సింహ సవాలు విసిరారు. ఉద్యమానికి ముందు, ఇప్పుడు తన ఆస్తులు ప్రకటిస్తానని, మరి కేసీఆర్ కు ఆస్తులు ప్రకటించే దమ్ముందా? అంటూ ఆయన సవాల్ చేశారు. కల్లబొల్లి మాటలు చెప్పే కేసీఆర్ ను నమ్మవద్దని ఆయన మెదక్ లో జరిగిన ఎన్నికల సభలో ప్రజలను కోరారు.