: అమర్ సింగ్ కు వ్యతిరేకంగా జయాబచ్చన్ ప్రచారం
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు... శత్రువులు ఉండరనేది జగమెరిగిన సత్యం. గతంలో అమర్ సింగ్, అమితాబ్ బచ్చన్ కుటుంబాల మధ్య సన్నిహిత సంబంధాలు ఉండేవి. అయితే ములాయం సింగ్ యాదవ్ తో విభేదించి సమాజ్ వాది పార్టీకి గుడ్ బై చెప్పిన అనంతరం అమర్ సింగ్ రాష్ట్రీయ జనతాదళ్ పార్టీలో చేరారు. ప్రస్తుతం ఆ పార్టీ తరపున ఫతేపూర్ సిక్రీ నియోజకవర్గం నుంచి అమర్ సింగ్ పోటీ చేస్తున్నారు.
ఈ నెల 24వ తేదీన జరిగే ఎన్నికల్లో అమర్ సింగ్ కు వ్యతిరేకంగా సమాజ్ వాది ఎంపీ జయా బచ్చన్ ప్రచారం చేయనున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తో కలిసి జయా బచ్చన్ ఫతేబాద్, ఎత్మద్ పూర్, ఫతేపూర్ సిక్రీలో ప్రచారం చేపట్టనున్నారు. ఫతేపూర్ సిక్రీ నియోజకవర్గంలో జయప్రద, శ్రీదేవి, బోనీకపూర్, రాజామురాద్, అస్రానీ తదితర బాలీవుడ్ ప్రముఖులతో ఇటీవల అమర్ సింగ్ ర్యాలీలు నిర్వహించిన విషయం విదితమే.