: నింగి, నేల ఉన్నంతవరకు నవ్విస్తూనే ఉంటా: బ్రహ్మానందం


మూడు దశాబ్దాల సినీ జీవిత ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశానని... అవన్నీ తన హృదయ ఫలకంపై తీపి గుర్తులుగా మిగిలిపోయాయని ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం వెల్లడించారు. నింగి, నేల ఉన్నంత వరకు ప్రేక్షకులకు వినోదం పంచుతూనే ఉంటానని ఆయన తెలిపారు. తెలుగు చిత్ర సీమకు వచ్చి మూడు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా చెన్నైలో బ్రహ్మానందం మీడియాతో మాట్లాడారు.

తాను చిత్ర పరిశ్రమకు రెండేళ్ల ముందే వచ్చినా... 1986లో జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ‘చంటబ్బాయ్’ సినిమా తనకు బ్రేక్ ఇచ్చిందని ఆయన అన్నారు. ఆనాటి జ్ఞాపకాల దొంతరలో నిక్షిప్తమైన స్మృతులను ఆయన ఈ సందర్భంగా నెమరువేసుకున్నారు. ఇప్పటివరకు వెయ్యికి పైగా సినిమాల్లో నటించానని బ్రహ్మానందం చెప్పారు. తాను ఈరోజు ఇంత విజయం సాధించానంటే చిత్ర దర్శకులు, నిర్మాతలే ప్రధాన కారణమని ఆయన అన్నారు. షూటింగ్ సమయంలో లైట్ బాయ్స్ నుంచి మేకప్ ఆర్టిస్టుల వరకు వారితో ఉన్న అనుబంధాన్ని బ్రహ్మానందం ఈ సందర్భంగా విశదీకరించారు. అటు తెలుగు, ఇటు తమిళ సినిమాల్లో నటిస్తూ 58 ఏళ్ల బ్రహ్మానందం మహా బిజీగా ఉన్నారు.

  • Loading...

More Telugu News