: దానం నాగేందర్ ఓ కబ్జాకోరు: షర్మిల
మాజీ మంత్రి దానం నాగేందర్ ఓ కబ్జాకోరు అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత షర్మిల విమర్శించారు. బీఎస్ మక్తాలోని మైనార్టీ భూములను కబ్జా చేసిన దానం... మంత్రిగా ఉన్న సమయంలో ఖైరతాబాద్ నియోజకవర్గానికి చేసిందేమీ లేదని ఆమె నిప్పులు చెరిగారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఆశీస్సులతోనే దానం గెలిచిన విషయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు.
ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ తరపున పోటీ చేస్తున్న పీజేఆర్ కుమార్తె విజయారెడ్డిని గెలిపించి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని ఆమె కోరారు. ఆమె గెలిచాక ఆ భూమిని మైనార్టీలకు అప్పగించే చర్యలు చేపడతామని షర్మిల హామీ ఇచ్చారు.