: ఇక పీఎఫ్ ఖాతాదారులకూ యునిక్ అకౌంట్ నెంబర్


తరచూ ఉద్యోగాలు మారే ఉద్యోగులకు ఈపీఎఫ్ వో కొత్త పథకంతో ఊరట లభించనుంది. ఉద్యోగం మారిన ప్రతిసారీ ప్రావిడెండ్ ఫండ్ (పీఎఫ్) ఖాతాను మార్చుకునే పని లేకుండా అక్టోబరు 15 నుంచి ప్రతి ఖాతాదారుకూ యూనివర్శల్ అకౌంట్ నెంబరును కేటాయించనున్నారు. ప్రస్తుతం ఈపీఎఫ్ వో పరిధిలో ఉన్న ఐదు కోట్ల మందికి పైగా ఖాతాదారులకూ ఈ పథకంతో లబ్ధి చేకూరుతుంది. దీంతో కొత్త ఉద్యోగంలో చేరిన వారు మళ్లీ కొత్తగా పీఎఫ్ నెంబరు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. నిర్మాణ రంగం లాంటి తరచుగా సిబ్బంది ఉద్యోగాలు మారే రంగాల్లో దీని వల్ల ఎంతో సౌకర్యం లభిస్తుందని ఈపీఎఫ్ అధికారులు చెప్పారు. ఎన్నిసార్లు ఉద్యోగం మారినా ఆ ఒక్క నెంబరే సరిపోతుంది. దీనివల్ల ఈపీఎఫ్ వో కు కూడా పనిభారం తగ్గనుందని అధికారులు చెప్పారు.

  • Loading...

More Telugu News