: వచ్చే నెల 3లేదా 4న సీమాంధ్రలో మోడీ ప్రచారం
సీమాంధ్రలో బీజేపీ పోటీ చేసే నాలుగు లోక్ సభ స్థానాల్లో నరేంద్రమోడీ ప్రచారం నిర్వహించనున్నారు. వచ్చే నెల 3 లేదా 4వ తేదీన మోడీ సభలు ఉంటాయని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు చెప్పారు. బీజేపీ విశాఖ, తిరుపతి, రాజంపేట, నరసాపురం లోక్ సభ స్థానాలలో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నియోజకవర్గాల పరిధిలో మోడీ సభలు జరగనున్నాయి.