: కేసీఆర్... ఇన్నాళ్లూ ఆ విషయం ఎందుకు చెప్పలేదు?: పొన్నాల
కేవీపీపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన ఆరోపణలను తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తిప్పి కొట్టారు. టీఆర్ఎస్ ను మూసేస్తే వేల కోట్ల రూపాయలు ఇస్తామంటూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కేవీపీ తనకు ఆఫర్ చేశారని కేసీఆర్ నిన్న సంచలన విషయాలు బయటపెట్డడంతో దీనిపై పొన్నాల స్పందించారు. "ఇన్నాళ్లూ ఆ విషయాన్ని ఎందుకు చెప్పలేదు?" అంటూ పొన్నాల ప్రశ్నించారు. ఫాంహౌస్ లో పడుకునే కేసీఆర్ ను తెలంగాణ ప్రజలెవరూ నమ్మరని ఆయన వ్యాఖ్యానించారు. ముషీరాబాద్ నియోజకవర్గం టీఆర్ఎస్ ఇన్ చార్జ్ వెంకటేశ్, తెలంగాణ జాగృతి హైదరాబాద్ నగర అధ్యక్షురాలు ఇందిర ఈరోజు పొన్నాల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా పొన్నాల మాట్లాడుతూ "ఎన్నికలప్పుడే కేవీపీ గుర్తుకు వచ్చారా?" అని కేసీఆర్ ను ప్రశ్నించారు.