: రైలు చార్జీలు మరోసారి పేలతాయి!
మరోసారి రైలు చార్జీలు కూతేయనున్నాయి. ప్రయాణ చార్జీలను పెంచకతప్పదని రైల్వే శాఖా మంత్రి పవన్ కుమార్ బన్సాల్ స్పష్టం చేసారు. 2013లో మరోసారి చార్జీల పెంపుదల ఉంటుందని ఆయన డిల్లీలో గురువారం మీడియాతో చెప్పారు. నిధుల లేమి కారణంగా తమ శాఖ పలు ప్రాజెక్టులను చేపట్టలేకపోతోందని తెలిపారు. రైల్వే శాఖ వర్గాల సమాచారం ప్రకారం చార్జీల పెంపు బడ్జెట్ సందర్భంగా ప్రకటిస్తారు. రైల్వే మంత్రి బన్సాల్ ఈ నెల 26న పార్లమెంటులో రైల్వే బడ్జెట్ ప్రవేశపెడతారు.