: మోడీపై బీహార్ ఒసామా బిన్ లాడెన్ పోటీ!


వారణాసిలో మోడీపై పోటీ చేయడానికి ఒసామా బిన్ లాడెన్ రెడీ అయిపోయారు. కరుడుగట్టిన ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ హతమై పోయాడు కదా, ఈ ఒసామా ఎవరా? అని అనుకుంటున్నారా? చూడ్డానికి ఆల్ ఖైదా దివంగత నేతలానే ఉంటాడు. పేరు మీరజ్ ఖలీద్ నూర్. అందుకే ఇతడిని కొందరు ఒసామాగా పిలుచుకుంటారు. రామ్ ఇండియా పేరుతో పార్టీని ఏర్పాటు చేసిన ఇతడు ఉత్తరప్రదేశ్ లోని వారణాసి లోక్ సభ స్థానంలో నరేంద్ర మోడీపై పోటీ చేయనున్నట్లు ప్రకటించాడు. పాట్నాకు చెందిన నూర్ గతంలో ఆర్జేడీ నేతగా ఉన్నారు.

  • Loading...

More Telugu News