: ఫోన్ దానంతట అదే చార్జ్


ఫోన్ చార్జ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? విద్యుత్, చార్జర్ అందుబాటులో ఉండాలి... అప్పుడే ఛార్జ్ చేసుకోగలం. కానీ ఇవేవీ అవసరం లేకుండా జస్ట్ మీరు ఉన్న చోట నుంచే మీ ఫోన్ చార్జ్ అయిపోగానే తిరిగి చార్జ్ అయితే భలే ఉంటుంది కదా! ఇందుకు వీలు కల్పించేలా శాస్త్రవేత్తలు వైర్ లెస్ పవర్ ట్రాన్స్ ఫర్ టెక్నాలజీని కనిపెట్టారు. ఇదొక్కటే కాదు... ఫ్యాన్ తదితర విద్యుత్ ఉపకరణాలు ఎలాంటి వైర్ కనెక్షన్ అవసరం లేకుండానే ఈ విధానంలో పనిచేస్తాయి. దీనికి సంబంధించి డిపోలే కాయిల్ రిసోనెంట్ సిస్టమ్(డీసీఆర్ఎస్)ను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ టెక్నాలజీ సాయంతో విద్యుత్ సదుపాయానికి ఐదు మీటర్ల దూరంలో ఉన్నా ఫోన్ చార్జ్ అవుతుందంటున్నారు దక్షిణ కొరియాకు చెందిన అడ్వాన్స్ డ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంజనీర్ చున్ టీ రుమ్.

  • Loading...

More Telugu News